Home రాజన్న సిరిసిల్ల ప్రాజెక్టుల భూ సేకరణలో సమస్యలు పరిష్కరించాలి

ప్రాజెక్టుల భూ సేకరణలో సమస్యలు పరిష్కరించాలి

MP-vinod-kumar-image

కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బో యిన్‌పల్లి,రుద్రంగి,కోనరావుపేట,చందుర్తి మండలాల్లో నిర్మిస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి నీటి ప్రాజెక్టుల భూ సేకరణలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎంపి వినోద్‌కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ సమస్యలు, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇబ్బందులపై జెసి షేక్ యాస్మిన్‌భాషా, డిఆర్‌ఒ శ్యాంప్రసాద్‌లాల్‌తో కలిసి అధికారులతో ఎంపి వినోద్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ చందుర్తి మండలం నర్సింగాపూర్ నుంచి కోనరావుపేట మండలం బండపల్లి చెరువులోకి నీరు తరలించేలా కాలువల నిర్మాణానికి భూ సేకరణ చేపట్టాలన్నారు. కలికోట చెరువులో నీళ్లు నింపేందుకు చెరువు విస్తరణ, కాలువల కోసం భూ సేకరణ జరపాలన్నారు. బోయినిపల్లి మండలం స్థంభంపల్లి చెరువు పునరుద్దరణ కోసం, కోనరావుపేట మండలం లచ్చపేట తండాలో చెరువు నిర్మాణం కోసం భూ సే కరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు,భూములు కోల్పోతున్న ప్రజలతో స్వయంగా మా ట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అదే విధంగా మధ్య మానేరు జలాశయం, భూ నిర్వాసితులు, ఇండ్లు కోల్పోయిన ప్రజలకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యా కేజీ మంజూరులో ఇబ్బందులను దూరం చేయాలన్నా రు. ఎంఎంఆర్ లో సకాలంలో నీరు నింపే సమయం లోపే ఇబ్బందులను పరిష్కరించి,అర్హులైన నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు విజయభాస్కర్‌రావు, ఈఈ, డిఈఈ తదితరులు పాల్గొన్నారు.