Saturday, April 20, 2024

అద్భుతమైన మెలోడి

- Advertisement -
- Advertisement -

Istam song release from Khiladi

 

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఇష్టం…’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకుంది. తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా.. రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అదరగొట్టారు. అద్భుతమైన ఈ మెలోడి ట్యూన్‌ను దేవీశ్రీ ప్రసాద్ అందించారు. శ్రీమణి అద్భుతమైన సాహిత్యం అందించగా.. హరి ప్రియ గానం అందరినీ ఆకట్టుకుంటోంది. యశ్ మాస్టర్ ఈ పాటను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News