Home జాతీయ వార్తలు మాయావతి సోదరుడి రూ. 400 కోట్ల బినామీ ఆస్తి స్వాధీనం

మాయావతి సోదరుడి రూ. 400 కోట్ల బినామీ ఆస్తి స్వాధీనం

mayawati-brotherన్యూఢిల్లీ: బీఎస్పీ అధినేత్ర మాయావతి సోదరుడు, ఆయన భార్యకు చెందిన రూ. 400 కోట్ల విలువచేసే బినామీ స్థలాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు జప్తు చేసుకున్నారు. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్, ఆయన భార్య విచితర్ లత బినామీలకు చెందిన నోయిడాలోని ఏడు ఎకరాల స్థలాన్ని ఐటి అధికారులు జప్తు చేసుకున్నారు. బినామ ప్రాపర్టీ ట్రాన్‌సాక్షన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 24(౩) కింద ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆనంద్ కుమార్‌ను మాయావతి ఇటీవలే నియమించారు. ఈ స్థలం విలువ రూ.400 కోట్లు ఉంటుందని ఐటి అధికారులు తమ నోటీసులో పేర్కొన్నారు.

IT attaches land of Mayawatis brother