Home జాతీయ వార్తలు కేరళలో బంగారం స్మగ్లింగ్ ప్రకంపనలు

కేరళలో బంగారం స్మగ్లింగ్ ప్రకంపనలు

IT department employee in Gold Smuggling affair

 

సిఎం పినరయి ప్రిన్సిపల్ సెక్రెటరీపై వేటు
ఐటి శాఖ ఉద్యోగిని స్వప్న సురేష్ పాత్రపై ఆరోపణలు

కొచ్చి : బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో సిఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటి సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గత వారం వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటి శాఖ ఉద్యోగిని స్వప్న సురేష్ పాత్రపై ఆరోపణలు బయటపడిన మరుసటి రోజే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. శివశంకర్ స్థానంలో మరో ఐఏఎస్ అధికారి మిర్ మహ్మద్‌ను నియమించినట్టు సీఎంఓ కార్యాలయం మంగళవారం వెల్లడించింది.

ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ 15 కోట్ల విలువైన గోల్ స్మగ్లింగ్స్ కేసుకు సంబంధించి కస్‌టమ్స్ అధికారులు ఉద్యోగిని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ యూఏఈ కాన్సులేట్ అధికారి స్వప్న సురేష్ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు.

IT department employee in Gold Smuggling affair