Friday, March 31, 2023

సాహసమే ఊపిరి

- Advertisement -

SKYఅందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ.. సాహసాలు చేస్తూ ప్రత్యేకంగా అందరి దృష్టి తమవైపు పడేలా చేసుకుంటోంది నేటి యువత. అలాంటికోవకు చెందిన పెద్దినేని సాయితేజ సాహసమే నా ఊపిరి అంటున్నాడు! భగభగమండే లావాలతో బద్దలయ్యే అగ్నిపర్వతాలనెక్కి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇలాంటి విన్యాసాలు అతితక్కువ మంది చేయగలుగుతారు..అలాంటి వారిలో ఒకరు సాయితేజ. సాహస క్రీడలపై ఆసక్తి చూపుతూ అగ్నిపర్వతాలు అధిరోహించే దిశగా అడుగులు వేశాడు. ఇండియాలోనే తొలి అగ్నిపర్వతారోహకుడిగా రికార్డు సాధించాడు. హైదరాబాద్‌కి చెందిన పెద్దినేని సాయితేజ(25) ఇండోనేషి
యాలోని బాలీ ద్వీపంలో ఉన్న ’గునుంగ్ అగుంగ్’ అగ్నిపర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు. సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వత్వాన్ని 2018 జనవరి 10న కేవలం 48 గంటల సమయంలోనే అధిరోహించాడు. ప్రమాదకరమని భావిస్తే సాహస క్రీడల్లో భారతీయులకు గుర్తింపు రావడం ఎలాగని ఆలోచించి.. అగ్నిపర్వతాల అధిరోహణను ఎంచుకున్నానని అంటున్నాడు.

ట్రెయినింగ్‌లో శిక్షణ తీసుకోవాలంటే వేల రూపాయలు కావల్సివస్తుంది.  మరోవైపు తల్లిదండ్రులు వద్దన్నా తన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని తొలి అడుగు వేసాడు. చివరికి విజయం సాధించాడు. ఇండోనేషియాలోని అతి ప్రమాదకరమైన అగ్నిపర్వతాల్లో ఒకటైన అగుంగ్ పర్వతం. అక్కడి మొత్తం లావాతో కప్పబడిన పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు ఉంటాయి . కాలు జారితే ప్రాణాలతో తిరిగి వస్తామన్న నమ్మకం ఉండదు.  సామాన్య ఉష్ణోగ్రత కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి శరీరంపై నీటి బుడగలు ఏర్పడి శరీరం అంతా విపరీతమైన మంటలు వస్తుంటాయి. భయంకరమైన  పర్వతం నుండి అగ్నిబాంబులు పేలుతూంటాయి. లావా ఉప్పొంగుతుంటే అగ్ని పర్వతం ఎక్కడమనేది సాధ్యంకాని పని.  ఎలాంటి సహాయకులు, శిక్షకుల సహకారం లేకుండానే సాయితేజ పర్వతారోహణ చేశాడు. తొలి భారతీయుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. 2017, మేలో ఇండోనేషియాలోని దుకోనో అగ్నిపర్వతాన్ని అధిరోహించాడు.  డుకోనో భయంకరమైన, క్రియాశీల అగ్నిపర్వతం. దానిలో లావా బాంబులు పేలుతూనే ఉంటాయి. డుకోనోపై సైంటిఫిక్ డేటా అంతగా దొరకదు. ఎందుకంటే ఇది ఇండోనేషియాలోనే మారుమూల ప్రాంతంలో ఉంటుంది. తనకు లావా అంటే భయమని, ఆ భయాన్ని పోగొట్టుకునేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. డుకోనోను అధిరోహించడం అంత తేలికైన పనేం కాదు.  ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు.  తనకు సాహసాలు చేయడమంటే ఇష్టమని, 11ఏళ్ల నుంచే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తేజ తెలిపారు. బీటెక్‌లో చేరి ఆ తర్వాత డ్రాపౌట్ అయ్యాడు. టెక్ అనలిస్టుగా కూడా విధులు నిర్వహించాడు. అంతేగాక, ఓ ఔత్సాహిక కంపెనీని స్థాపించాడు. ఐటీలో చేసిన సేవకు గానూ తనకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.లక్ష చెక్కును కూడా అందించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటు ఇతర కొత్త ప్రాంతాలను సందర్శించినట్లు సాయితేజ చెప్పాడు.  అగ్నిపర్వతారోహణలో మొదటి భారతీయుడిగా నిలవాలన్న సంకల్పంతో దానిపై చాలా కాలం అధ్యయనం చేశాడు. ఇంతకుముందు ఎవ్వరు దానిపై ఈ సాహసం చేయలేదని తెలసుకున్నాడు.  అంతే తాను ప్రయత్నించి విజయం సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News