Saturday, April 20, 2024

సారధ్యం తేలిక కాదు

- Advertisement -
- Advertisement -

It is not easy to handle Captaincy responsibilities

 

సౌరవ్ గంగూలీ

ముంబై: క్రికెట్‌తో సహా ఏ అంశంలోనైనా సారధ్య బాధ్యతలు నిర్వహించడం అనుకున్నంత తేలిక కాదని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇక, భారత జట్టుకు కెప్టెన్సీ వహించడం అంటే కత్తిమీద సాములాంటిదేనని పేర్కొన్నాడు. జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకునే అభిమానులు ఒక్క మ్యాచ్‌లో ఓడితే విమర్శలకు దిగేందుకు కూడా వెనుకాడరని వ్యాఖ్యానించాడు. ఇక వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకుంటేనే మంచి కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉంటుందన్నాడు. ఇక, సారధిగా ఉండే వారికి సహనం, ఓర్పు, అంకితభావం చాలా అవసరమన్నాడు. ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి వారి సేవలను సరైన రీతిలో ఉపయోగించుకున్న వాడే తన దృష్టిలో అత్యుత్తమ కెప్టెన్ అని గంగూలీ పేర్కొన్నాడు.

అంతేగాక ఏ ఆటగాడికి ఏ బాధ్యత అప్పగించాలనే దానిపై కూడా సారధిగా పూర్తి అవగాహన ఉండాలన్నాడు. ఇక కెప్టెన్‌గా ఉండే వాడు సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు. ఇక, అన్ని సార్లు కెప్టెన్ వ్యూహాలు ఫలించడం సాధ్యం కాదన్నాడు. ఇక ఇలాగే బ్యాటింగ్, అలాగే బౌలింగ్ చేయాలని కెప్టెన్ అనే వ్యక్తి సహచరులపై ఒత్తిడి తేలేడన్నాడు. యువరాజ్‌ను ద్రవిడ్‌లా, ద్రవిడ్‌ను యువీల ఆడడం అంటే కుదరని పని అని గంగూలీ పేర్కొన్నాడు. సందర్భాన్ని బట్టి తన నిర్ణయాలు మార్చుకోవడం, ఎదుటి వారిపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడే ఎవరైనా కెప్టెన్‌గా విజయవంతమవుతాడని వివరించాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో గంగూలీ ఈ వివరాలు వెల్లడించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News