మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలీ స ంఘం ఎన్నికలను సభ్యులకు తెలపకుండా నిర్వహించడం సమంజసం కాదని తెలంగాణ పద్మశాలీ సంఘం జిల్లా కన్వీనర్ గోనె ఎల్లప్ప అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పద్మశాలీ సంఘం మార్కండేయ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 500 రూపాయల చొప్పున చెల్లించి 800 మంది సభ్యులు సంఘంలో చేరారని వారికి తెలపకుండా ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గాన్ని ప్రకటించుకోవడం సరైంది కాదన్నారు. మరోవైపు తెలంగాణ పద్మశాలీ సంఘం, అఖిలభారత పద్మశాలీ సంఘం అనుబంధంగా సిరిసిల్ల జిల్లా పద్మశాలీ సంఘం కొనసాగుతుండగా కొందరు అదే పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని దానిపై రిజిస్ట్రార్‌తో మాట్లాడగా వారి సంఘాన్ని రద్దు చేశారని వివరించారు. ఎన్నికలు సంఘం రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై కేసు నడుస్తుందని, హైకోర్టు తీర్చే శిరోధార్యంగా ముందుకు సాగుతామన్నారు. చట్టబద్దంగా తాము సభ్యులను చేర్పించి సభ్యులందరితో కలిసి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. అధికారికంగా తెలంగాణ పద్మశాలీ సంఘం తనను జిల్లా కన్వీనర్‌గా నియమించిన నియామక పత్రాన్ని ఆయన ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిమ్మని ప్రకాశ్, గంజి పరంధాములు, మేర్గు అంజయ్య, కొండ దినేశ్, బండారి సమ్మయ్య, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సభ్యులకు తెలపకుండా ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదు
- Advertisement -
- Advertisement -