Home రాష్ట్ర వార్తలు గ్రామాల్లో ఐ.టి. గల్లంతు

గ్రామాల్లో ఐ.టి. గల్లంతు

9,000 పంచాయతీల్లో కంప్యూటర్ల ద్వారా పనిచేస్తున్నవి 540 మాత్రమే

itహైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలందించే గ్రామపంచాయతీ కార్యాలయాలు ఐటి విని యోగానికి సుదూరంగా ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 9 వేల గ్రామ పంచా యతీల్లో కేవలం ఐదు, ఆరు వందల పంచా యతీల్లో మాత్రమే పూర్తిస్థాయిలో కంప్యూట ర్లను వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంట ర్నెట్ కనెక్షన్ ఇస్తామని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞా నాన్ని విస్తృతంగా వినియోగించుకుంటూ అభివృ ద్ధిలో దూసుకుపోతామంటూ అవకాశమున్న ప్రతి వేదికపైనా ప్రభుత్వం ప్రకటించడం పరిపాటిగా ఉంది. హైదరాబాద్‌కు విశ్వవ్యాప్తంగా ఐటి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్ప టికీ, ఐటి సేవలను, గ్రామీణ ప్రజలకు పూర్తి అందిం చలేకపోతున్నారు.
540 పంచాయతీల్లోనే ఆస్తి పన్ను వసూళ్లు
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలోని సుమారు రెండువేల గ్రామపంచాయతీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకు నేందుకు, ఇ-పంచాయత్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా గ్రాంటును విడుదల చేశారు. అవస రమైన కంప్యూటర్లు,  ప్రింటర్లు తదితరాలను కొనుగోలు చేసి పంచాయతీలకు చేరవేశారు. భారీ వ్య యంతో కూడుకున్నది కావడంతో సుమారు 1,300 పంచాయతీల్లో మాత్రమే కొద్ది రోజుల పాటు వీటిని వినియోగించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అన్ని రకాల సేవలను ఐటి సేవల రూపంలో అందించేందుకు అవసరమైన పరిజ్ఞా నాన్ని అందిపుచ్చుకుని, పనిచేస్తున్నవి కేవలం ఆరువందల పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా ఆస్తిపన్ను వసూలు అనే ప్రక్రియను పూర్తి గా కంప్యూటర్ల ద్వారా చేస్తున్నవి సుమారు 540 పంచాయతీలు మాత్రమే ఉండగా, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నవి కేవలం 415 మా త్రమే ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర రాజధానిలో దాదాపు భాగమైపోయిన రంగారెడ్డి జిల్లాలోని యాభై శాతం పైగా గ్రామపం చాయతీల్లో ఇంకా ఐటి వినియోగమే లేదని అధికార వర్గాల ద్వారా తెలిసిం ది. మిగిలిన జిల్లాల్లో అయితే, వందలు, వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే ఐటిని ప్రజా సేవలకోసం వినియోగిస్తున్నా రు. ఈ విధంగా అమలు చేస్తున్న వాటి నుంచే మెరుగైన పంచాయతీలు జాతీ య స్థాయిలో పోటీపడుతూ, అవార్డులు కూడా సాధించాయి.
సాఫ్ట్‌వేర్ ఉన్నా వినియోగించడం లేదు
గ్రామ పంచాయతీల్లో రికార్డుల నిర్వహణ, అంటే ఆస్తిపన్ను వసూళ్లు, నిధుల వినియోగం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి వెన్నో కార్యక్రమా లను ఐటి ద్వారా నిర్వహించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభు త్వం రూపొందించింది. అయితే వీటిని అన్ని పంచాయతీలకు విస్తరించడం లో మాత్రం విఫలమవుతోంది. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో పంచా యతీ కార్యాలయాలకు అవసరమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని బిఎస్‌ఎన్‌ల ద్వారా సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మారుమూల ఉ న్న ప్రాంతాల్లో తమకు కేబుల్ లైన్లు లేవని, అందువల్ల కనెక్టివిటీని కల్పించలే మని బిఎస్‌ఎన్‌ఎల్ చేతులెత్తేయడంతో, ఇ-పంచాయత్ ప్రాజెక్టుకు ఎంపికైన గ్రామ పంచాయతీల నిర్వాహకులు కూడా కంప్యూటర్లను వినియోగించే అం శంలో దృష్టి సారించడం మానేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోను ప్రస్తుతం మొబైల్ సేవలు విస్తరించి, దాదాపు ప్రతి కుటుంబం సెల్ ఫోన్ వినియోగిస్తు న్నప్పటికీ, గ్రామ పరిపాలనకు నిలయమైన పంచాయతీ కార్యాలయాలకు మాత్రం ఆ భాగ్యం కరువైంది.
నిర్వహణకు నిధుల సమస్య
ప్రధానంగా కంప్యూటర్ల నిర్వహణ, వాటి ఆపరేటర్లకు జీతభత్యాలు, అవస రమైన ఇంటర్‌నెట్ కనెక్టివిటీ మొదలైన ఆర్థికంగా భారం కావడంతో ఈ ప్రాజె క్టు మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇప్పటికే కంప్యూటర్లను వినియోగి స్తున్న చాలా పంచాయతీల్లో ఆపరేటర్లకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు అవసరమంటూ పంచాయతీరాజ్‌శా ఖ ప్రభుత్వానికి అనేక సార్లు నివేదికలు పంపినా ఫలితం మాత్రం శూన్యం. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కెటిఆర్ అన్ని గ్రామాలకు ఇంట ర్‌నెట్ కనెక్టివిటీని కల్పించడానికి, పలు టెలికాం ఆపరేటర్లతో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఆర్ధిక పరమైన అంశాల కారణంగా అవి ఫలించలేదని అధికా రులు అంటున్నారు. ఇదిలా ఉంటే, మిషన్ భగీరథ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం పనులతో పాటే, ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను కూడా వేయాలని, తద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సుల భంగా లభిస్తుందని, దీనిద్వారా గ్రామ పంచాయతీల్లో కూడా ఐటి ద్వారా సేవలను సమర్థంగా విస్తరించవచ్చని పంచాయతీరాజ్ శాఖ ఆశిస్తోంది. కేబుల్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ , కంప్యూటర్ల కొనుగో లు, ఆపరేటర్ల వేతనాలు తదితర వాటికోసం భారీ ఎత్తున అవసరమయ్యే నిధుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు లభించని పక్షంలో ఇ- పంచాయ తీ అనేది అందని ద్రాక్ష పండే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.