Friday, March 29, 2024

నయీం కుటుంబ సభ్యులకు ఐటి నోటీసులు

- Advertisement -
- Advertisement -

Naeem family members

 

బినామీలకు కూడా?

బినామీలకు సైతం ఐటి అధికారుల నోటీసులు ?
ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం
సిట్ విచారణలో వెలుగుచూసిన రూ.2,000 కోట్లు

మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి, (హైదరాబాద్) : గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు మంగళవారం నాడు ఐటి శాఖ నోటీసులు జారీ చేయడంతో భువనగిరిలోని నయీమ్ ఇంటికి ఐటి అధికారులు నోటీసులు అంటించారు. ఐటి శాఖ అధికారులు నయీమ్ తల్లి తహేరాబేగం, సోదరి సలీమా, భార్య హసీనా బేగం, అతని అనుచరుడు పాశం శ్రీనివాస్ పేరిట నోటీసులు జారీ చేశారు. ఇదిలాఉండగా 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ పట్టణ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లోని ఒ ఇంట్లో దాక్కున నయీంను పోలీసులు చుట్టుముట్టి ఎన్‌కౌంటర్ చేసిన విషయం విదితమే. నయీం అక్రమంగా ఆర్జించిన మొత్తాలకు చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా పక్కాగా లెక్కలు ఉన్నప్పటికీ ఆదాయ పన్నుల చెల్లించలేదని ఐటి అధికారుల దర్యాప్తులో తేలింది. అప్పట్లో సిట్ వర్గాల దర్యాప్తులో సైతం ఆదాయ పన్ను కట్టినట్లు ఏలాంటి ఆధారాలు దొరకలేదు.

నయీం సంపాదించిన ఆస్తులను బినామీల పేరున ఉంచాడని, ఈక్రమంలో తన వరుసకు సోదరుడ య్యే ఫహీం పేరుతో రూ.350 కోట్లు, తన అనుచరురాలు ఫర్హా నా పేరుపై రూ.250 కోట్ల మేర ఆస్తులు, అలాగే నయీం ము ఖ్య అనుచరులైన శేష న్న, పాశంశీను సం బంధీకుల పేరు మీద దాదాపు రూ. 250 కోట్ల ఆస్తులు పెట్టినట్లు ఆప్పట్లో సిట్ గుర్తించింది. కాగా నయీం భార్య పేరుతో కొద్ది పాటి ఆస్తులతో పాటు ఐటి అధికారుల దర్యాప్తులో హైదరాబాద్ నగర శివారులోని తుక్కుగూడలో 12 ఎకరాల ఫాం హౌస్‌ను అరబ్ దేశాల్లో ఉంటున్న తన దూరపు బంధువు పేరిట ఉంచినట్లు తేలింది. వెరసి నయీంకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తులను బినామీ ప్రాపర్టీస్ ప్రోబిషినరీ యూనిట్ కింద ఆస్తులున్నట్లు ఐటి అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా గతేడాది చివరిలో గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువకు సంబంధించి ఇందుకోసం ఏర్పాటు సిట్ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.

నయీమ్‌కు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని అప్పట్లోనే సిట్ వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఎపి, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. 15 ఎకరాల భూమి, 29 భవనాలు ఉన్నాయని వెల్లడించారు. 1.90 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 2.8 కోట్ల నగదున్నాయని తెలిపారు. 258 సెల్ ఫోన్లు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలున్నాయని, మారణాయుధాలున్నాయని సిట్ అధికారులు గుర్తించారు.

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం
గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఐటిశాఖ రంగం సిద్ధం చేస్తోంది. నయీం ఆస్తులపై ఐటి అధికారుల విచారణ దాదాపు పూర్తి కావడంతో నయీం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ. 1200 కోట్లు ఉంటుందని ఐటి అధికారులు భావిస్తున్నారు. దీంతో బినామీ ప్రాపర్టీస్ ప్రోబిషినరీ యూనిట్ కింద ఆస్తులను అటాచ్ చేయనున్నారు. అడ్జుకేటింగ్ అథారిటీతో బినామీ ప్రాపర్టీస్ కింద ఆస్తులను అటాచ్ చేయాలని గతంలో ఇన్‌కంట్యాక్స్ పిటిషన్ వేసిన విషయం విదితమే. ఐటి అధికారుల దర్యాప్తులో హైదరాబాద్ నగర శివారులోని తుక్కుగూడలో 12 ఎకరాల ఫాం హౌస్‌ను అరబ్ దేశాల్లో ఉంటున్న తన దూరపు బంధువు పేరిట ఉంచినట్లు తేలింది. వెరసి నయీంకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తులను బినామీ ప్రాపర్టీస్ ప్రోబిషినరీ యూనిట్ కింద ఆస్తులను అటాచ్ చేయనున్నారు.

 

IT notices to Naeem family members
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News