Home తాజా వార్తలు తెలుగు రాష్ట్రాల్లో 3 ఇన్‌ఫ్రా కంపెనీలపై ఐటి దాడులు

తెలుగు రాష్ట్రాల్లో 3 ఇన్‌ఫ్రా కంపెనీలపై ఐటి దాడులు

మనతెలంగాణ/హైదరాబాద్:మూడు ఇన్ ఫ్రా కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పుణె సహా 40 ప్రాంతాలలో జరిపిన సోదాలలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని గురువారం నాడు ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. బోగస్ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు ద్వారా భారీగా నగదు చలామణి చేస్తున్నట్లు గుర్తించామని, ఎపి, తెలంగాణలోని 3 ఇన్‌ఫ్రా కంపెనీలకు సంబంధించి విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెల్లో చేపట్టిన ఐటి సోదాలలో పెద్ద ఎత్తున నకిలీ బిల్లులు, కీలక పత్రాలు లభించాయన్నారు. సోదాలలో భాగంగా హైదరాబాద్ విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్ల్లీ, పుణె నగరాల్లో దాడులు జరిపామని వెల్లడించింది . తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయిని, ఇన్ ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని ఐటి శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో లెక్క చూపని రూ.85 లక్షల నగదు, రూ.71లక్షల విలువైన ఆభరణాలు తమ సోదాల్లో లభ్యం కావడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు జరిపామని ఈ సందర్భంగా ఐటిశాఖ వెల్లడించింది. అదేవిధంగా ప్రముఖ కాంట్రాక్టర్లకు చెందిన 25 కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించామని, ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలో దాదాపు 72 గంటల పాటు తనిఖీలు చేశామని వివరించారు.

IT Officials attack on 3 Infra companies in Telugu states