Saturday, April 20, 2024

ఫినిక్స్‌పై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

ఏక కాలంలో 20చోట్ల 30
బృందాలతో సోదాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థిరాస్తి, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఫీనీక్స్ కంపెనీపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేశ్, ఆ యన తనయుడు అవినాష్, సంస్థ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు కలిపి మొత్తం 20 చోట్ల లో ఏక కాలంలో తనిఖీలు చేశారు. ఆదాయ పు పన్ను చెల్లింపుల్లో తేడా ఉందన్న ఆరోపణ ల నేపథ్యంలో దాడులు నిర్వహించారు. జం టనగరాల్లో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఈ సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ప్రధాన కార్యాలయం, మాదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్, నానక్‌రాం గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ గేటెడ్ కమ్యూనిటీలో డైరెక్ట ర్ల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఐటి అధికారులతో పాటు దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలతో సహా మొత్తం 30 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సంస్థ ఆదాయం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల ఫీనిక్స్ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్‌ఐసిసిలో ఘనంగా నిర్వహించగా, ఆ వేడుకలకు రాజకీయ ప్రముఖులు, విఐపిలు, కలెక్టర్లు, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు కూడా వచ్చారు.

వేడుకలకు భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. ఫీనిక్స్ సంస్థలో పలువురు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థపై అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. నగరంలోని డైరెక్టర్ల నివాసాలతో పాటు హైదరాబాద్‌లో వ్యవస్థాపకుడు సురేష్ చుక్కపల్లి ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగించారు. ఈ కంపెనీని సురేష్ చుక్కపల్లి (ఆయన అంతకుముందు ల్యాంకో గ్రూపులో భాగం) సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అయితే కూకట్‌పల్లిలో ల్యాండ్ డీల్ విషయంలో ఫీనిక్స్, మరో రెండు కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి దాడులు జరుగుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇటీవలే.. వాసవీ గ్రూప్ పై అధికారులు దాడులు నిర్వహించారు. మళ్లీ మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ గ్రూప్‌పై ఏకకాలంలో దాడులు నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News