Home తాజా వార్తలు రేవంత్‌ నివాసంలో ముగిసిన ఐటి సోదాలు

రేవంత్‌ నివాసంలో ముగిసిన ఐటి సోదాలు

IT Raids completed at Revanth Reddy's Residence

హైదరాబాద్: కాంగ్రెస్ లీడర్ రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు అధికారులు సోదాలు చేశారు. అనంతరం ఐటి అధికారుల బృందం రేవంత్ ఇంటి నుంచి తిరిగి వెళ్లిపోయింది. అక్టోబర్ 3న ఐటిశాఖ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. 31 గంటల పాటు రేవంత్‌రెడ్డిని విచారించిన అధికారులు 150 ప్రశ్నలకు ఆయన నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాలు తీసుకున్నారు. అక్టోబర్ 1న రేవంత్‌ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డి, ఉదయసింహ.. అక్టోబర్ 3న రేవంత్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం 43 గంటల పాటు అధికారులు రేవంత్ నివాసంలో కీలకపత్రాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రింటర్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రేవంత్ డొల్ల కంపెనీలు, బినామీ పేర్లతో అక్రమార్జనలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.