Friday, March 29, 2024

రియల్‌పై ఐటి పంజా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడుల కలకలం రేగింది. 65 బృందాలుగా ఏర్పడి ఐటి అధికారులు సోదాలు నిర్వహిం చారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఐటి, ఇడి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ప్ర ముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఇన్‌కం టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించా రు. నగరంలోని సుమారు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తెలంగాణ, ఒడిశాకు చెందిన ఐటి అధికారులు బృందాలు తనిఖీలు చేశా రు. కోహినూర్ గ్రూప్ తో పాటు మరో రెం డు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ఆఫీసు లు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఈ తనిఖీలు చేసినట్లు తె లుస్తోంది. శంషాబాద్, అత్తాపూర్, మాదన్నపేట్,కొండాపూర్, మెహదీపట్నం, శాస్త్రిపు రం, బంజారాహిల్స్‌తో పాటు పలుచోట్లకు ఉదయం 6గంటలకే అధికారులు చేరుకున్నారు. మాదన్నపేట రామచంద్ర నగర్ లో ని కోహినూర్ డెవలపర్స్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో వివిధ డాక్యుమెంట్లను పరిశీలించా రు. సంస్థ ఆదాయానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కోహినూర్ డెవలపర్స్ సంస్థ సిటీతో పాటు శివార్లలోనూ పలు ప్రాజెక్టులు చేపట్టింది. ప్రభుత్వ భూము ల లోనూ ఈ గ్రూపు వెంచర్లు వేసింది. అయితే, ఈ సంస్థ వెనక ఓ రాజకీయ నాయకుడి హ స్తం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయ నా య కుడు ఎవరనే దానిపై ప్రస్తుతం చర్చ జ రుగుతోంది. మరోవైపు  ఎపిలోని విశాఖలోనూ ఐటి సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని పదికి పైగా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో 15 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. పలు ఫార్మా సంస్థలతో పాటు ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగా యన్న అనుమానంతో సోదాలు నిర్వహిం చినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా నగరంలో ఉన్న ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో ప్రజల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితి సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. భారీగా నిధులను మళ్లించిందని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలక పత్రాలను ఇడి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సంస్థలో ఒక డైరెక్టర్ ఏకంగా రూ.100 కోట్లను దారిమళ్లించినట్లు తెలిసింది. దానికి సంబంధించిన ఆధారాలూ సోదాల్లో లభించడంతో ఇడి పట్టు బిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News