Tuesday, January 31, 2023

శాతకర్ణీ నిర్మాతలకు.. ఐటి షాక్!

- Advertisement -

Gautamiputra-Satakarni.హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో కూడా శాతకర్ణీ మంచి వసూళ్లు రాబడుతూ.. నిర్మాతలకు మంచి ఆదాయాన్ని తెస్తోంది.

తాజాగా చిత్ర నిర్మాణ సంస్థలైన శ్రేష్ఠ్ మూవీస్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్ కార్యాలయాలపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చిత్ర నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సురేష్ రెడ్డిల కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఐటి శాఖ అధికారులు దీనిపై ఎటువంటి సమాచారాన్ని బయటపెట్టడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles