Home తాజా వార్తలు ఘనంగా లష్కర్ బోనాలు

ఘనంగా లష్కర్ బోనాలు

YOU_8983ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు

మన తెలంగాణ / బేగంపేట్: సికింద్రాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన బోనాల జాతరకు భక్తులు, రాజకీయ నేతలు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచి భక్తుల తాకిడి మొదలైంది. రాజకీయ నాయకుల తాకిడికి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. పోలీసులు రాజకీయ నాయకులకే పెద్దపీట వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. బోనాలతో వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా దర్శనం చేయించి పంపు తామని చెప్పిన ఆలయ అధికారులు, పోలీసుల మాటలు నీటిమూటలయ్యాయి. భక్తుల దర్శ నానికి నాలుగు గంటల సమయం పట్టిం దంటే పరిస్థితి ఎంత గడ్డుగా ఉన్నదో అర్ధం చేసుకో వచ్చు. ఒక దశలో బోనాలతో వచ్చిన భక్తులకు సైతం దర్శనానికి అనుమతి ంచలేదు. గంటల తరబడి లైన్లలో నిలబడి చివరకు అతి కష్టం మీది దర్శనం చేసుకున్నారు.
భక్తుల తాకిడితో కిటకిటలాడిన పురవీధులు… బోనాల పండుగకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాలనుండి తమ ఇం టికి వచ్చి బోనాల పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకొం టారు. అయితే నగరంలోని ఇతర ప్రాంతాల్లో వచ్చేవారం జరుపుకుంటారు. అందుకోసం పలు బస్తిలనుంచి కుడా భక్తులు వచ్చి ఉజ్జయిన మహంకాళి అమ్మవారిని దర్శిం చుకున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రతి వీదినుండి డప్పులు వాయిద్యాలతో, పోతరాజుల విన్యాసాలతో ఊ రేగింపుతో వచ్చి అమ్మవారి ఆసిస్సులు పొందారు. మహి ళలు పిల్లలతో కుటుంభ సమేతంగా వచ్చి మహంకాళిని దర్సించుకున్నారు.
సిసి కెమెరాలతో పర్యవేక్షించిన సిపి
నగరపోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మహంకాళి జత రను సిసి కెమెరాల ద్వారి పర్యవేఓఇంచడం జరిగింది. మహంకాళి పరిసర ప్రాంతల్లో కలియ తిరిగి బందోబ స్తులు ఎలా నిర్వహించాలో స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయంల లేకుండా దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. పోలీస్ శాఖ పరంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయ డం జరిగింది. తెల్లవారు జామున 3 గంటల నుండి పోలీ సులు పర్యవేక్షిస్తున్నారని అయితే పిక్ పాకెట్లు జరుగు తున్నాయని పుకార్లు జరుగుతున్నాయే తప్ప అలాంటివి జరుగలేదని చెప్పారు. అనుమాన స్పద వ్యక్తులు కనబ డితే 100కు గాని మహంకాళి పోలీసులకు ఫోన్‌ద్వార తెలియజేయాలని చెప్పారు.
వర్షాలు కురువాలని కోరుకున్న రాజకీయ నాయకులు
రాష్ట్రంలో వర్షాలు కురవక పోవడం వల్ల రైన్నలు డబ్బు లు పొలాల్లో పోసి ఆకాశం వైపు చూస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి నాయిన నర్సింహారెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి ఈటేల రాజేందర్‌లు తెలిపారు. మహంకాళి అమ్మవారిని దర్సించుకున్న తరువాత మీడీయపాయింట్‌లో ఈటెల మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పండుగలు, దేవుళ్ళు నిరక్షానికి గురైందని రాష్ట్రం ఏర్పడ్డ తరువాత దేశంలో ఎవరు ఊహించనంత రీతిలో పుష్కరాలను మా ప్రభు త్వం నిర్వహించిందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గర్వించేల అత్రగామిగా నిలుస్తుందని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ అ మ్మవారి కృప రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడు ఉంటుందని అ యితే వర్షాలు పడడంలో కొంత ఆలస్యం అయిన్పటికి వర్షాలు పుష్కలంగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుం దని ఆశభావం వ్యక్తం చేశారు. పుష్కారాల్లో ఎంపిలు, ఎమ్మెల్లేలు, పోలీసులు రాత్రింభవల్లు పనిచేయడం వల్ల ప్రజలనుండి ప్రశంసలు పొందారని తెలిపారు. మ హంకాళి జతరలో ప్రజలు సహకరించాలని మీ యోక్క సహాకారమే ప్రభుత్వానికి కొండంత బలంఅని తెలిపారు. సకాలంలో వర్షాలు పడి రాష్ట్రప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నాని నాయిని తెలిపారు.
12.10 నిముషాలకు అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి
సమయం 12.10 నిముషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుగారు సికింద్రాబాద మహంకాళి అమ్మ వారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ కార్యనిర్వహ ణాదికారి ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలతో స్వాగ తం పలికారు. ఇఒ. అశోక్ గౌడ్ దగ్గర ఉండి ముఖ్య మంత్రికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. ముఖ్య మంత్రి వెంటా దేవాదాయ శాఖ మంత్రిఇంద్రకరణ్ రెడ్డి, కొండ సురేఖ, డి. శ్రీనివాస్ అమ్మవారిని దర్శించు కున్నారు.
బోనమెత్తిన ఎంపి కవిత, పద్మా
సికింద్రాబాద్ మహాంకాళి జాతరకు ఎంపి కవిత, పద్మదే వేందర్‌లు సాంప్రాదాయ బద్దంగా బోనాలతో అమ్మవా రిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. మహాంకాళి అమ్మవారిని దర్సించుకున్న రాజకీయ నా యకల్లో టిఆర్ ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మా రావు, పోచారం శ్రీనివాస్, జగదీశ్‌రెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ కోదండరాం, రసమయి బాలక్రిష్ణ, కాంగ్రే స్ నాయకులు, గీతారెడ్డి, దానం నాగేందర్, భట్టివిక్ర మార్క, కోదండరాం, బిజెపి వెంకయ్యనాయుడు, బండా రు దత్తత్రేయ, కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, భావర్‌లాల్ వర్మ, టిడిపి నాయకులు కంటోన్మేంట్ ఎంపి మల్లారెడ్డి, టిడిపి నగర అధ్యక్షుడు సి. క్రిష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జాడలేని సాంస్కృతిక కార్యక్రమాలు
మహంకాళి జతరకు 255 మంది కళాకారులు సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రాధన కూడళ్ళలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటయాని చెప్పడం జరిగింది కాని మచ్చుకైన కళాకారుల బృందాలు కనిపించలేదు.