Friday, April 19, 2024

కాంగోలో ఇటలీ రాయబారి హతం

- Advertisement -
- Advertisement -

రోమ్: కాంగోలో ఇటలీ రాయబారి, వెంట ఉన్న ఓ పోలీసుఅధికారి సోమవారం కాన్వాయ్‌పై జరిగిన దాడిలో మృతి చెందారు. ఐరాస కాన్వాయ్‌లో వెళ్లుతుండగా గోమా ప్రాంతంలో ఘటన జరిగిందని కాంగో విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇటీలీ అంబాసిడర్ లూకా అటానాసియోతో పాటు ప్రయాణిస్తున్న భద్రతాధికారి కూడా హతులయ్యారని సంక్షిప్త ప్రకటనలో తెలిపారు. కాంగోలో పరిస్థితుల స్థిరీకరణకు వచ్చిన ఐరాస బృందంలో వీరు ఉన్నట్లు వెల్లడైంది. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు.

Italy Ambassador killed in Congo

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News