Tuesday, April 16, 2024

ఐటమ్ సాంగ్‌కు మంచి స్పందన

- Advertisement -
- Advertisement -


శివాజీ రాజా అబ్బాయి విజయ్ రాజా, తమన్నా వ్యాస్ హీరోహీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. దుర్గాదేవి మల్టీమీడియా పతాకంపై తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాసరావులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాటకు మిలియన్లలో వ్యూస్ లభించాయి. ఇటీవల ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ అయిన ఐటమ్ సాంగ్ ‘కత్తి ఖతర్నాక్’ను శివాజీ రాజా విడుదల చేశారు.

ఈ పాటకూ శ్రోతల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ “చాలా పాజిటివ్ టైటిల్ ఇది. సినిమా అంతా కూడా అదే పాజిటివ్‌తో రూపొందుతోంది. పాటలు, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఈ ఐటమ్ సాంగ్‌లో ఫాల్గుణి, విజయ్ రాజా అద్భుతంగా నర్తించారు”అని అన్నారు. హీరో విజయ్ రాజా మాట్లాడుతూ ఐటమ్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ “మా చిత్రానికి సంగీత దర్శకుడు గ్యాని సింగ్ మంచి పాటలు అందించారు. హీరో విజయ్ రాజా డ్యాన్స్‌లు, ఫైట్స్ ఇరగదీశారు”అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News