Home జాతీయ వార్తలు ‘స్టాండప్ ఇండియా’ ప్రారంభించడం ఆనందంగా ఉంది : జైట్లీ

‘స్టాండప్ ఇండియా’ ప్రారంభించడం ఆనందంగా ఉంది : జైట్లీ

Arun-Jaitely-Standup-Indiaనోయిడా : చిన్న చిన్న వ్యాపారులు కొన్నిసార్లు రుణాలు పొందడం కోసం ప్రయాస పడాల్సి ఉంటుందని, ఈ తరుణంలో స్టాండప్ ఇండియా కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. స్టాండప్ ఇండియా ప్రారంభోత్సవ వేడుకలో ప్రసంగించిన ఆయన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వారికి ముద్రా బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి చేరడమే లక్షంగా పని చేస్తున్నమని, దేశంలో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించాలన్నదే ప్రధాని మోడీ లక్షమని జైట్లీ స్పష్టం చేశారు.