Home జాతీయ వార్తలు పౌరసత్వ బిల్లుపై సుప్రీంకు ఐయుఎంఎల్

పౌరసత్వ బిల్లుపై సుప్రీంకు ఐయుఎంఎల్

Supreme Court

 

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయుఎంఎల్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ మౌలిక హక్కుకు ఇది వ్యతిరేకమని, మతం ప్రాతిపదికన ఒక వర్గం అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని న్యాయవాది పల్లవి ప్రతాప్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో ఐయుఎంఎల్ ఆరోపించింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తున్న ఈ బిల్లు అమలు కాకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. వలసదారులకుపౌరసత్వం ఇవ్వడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే ముస్లింలను వేరు చేసి చూడడమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని ఆ పిటిషన్‌లో ఆరోపించారు.

IUML to to challenge Citizenship Bill in Supreme Court