Friday, March 29, 2024

జ్యోతికుమారిపై ఇవాంకా ట్రంప్‌ ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: లాక్ డౌన్‌లో వలస కూలీలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసిన కారణంగా పలు రాష్ట్రాల్లో వలస కూలీలు చొక్కుకుపోయారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. అప్పటి వరకు సహనంతో ఉన్న వలస కూలీలు..లాక్‌డౌన్ పొడిగించడంతో ఇక తమ వల్ల కాదంటూ వలస కూలీలు సొంత ఊర్లకు వెళ్లేందుకు కాలి నడకను నమ్ముకున్నారు. కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వలస కూలీలు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు.

ఈ క్రమంలో 15 ఏళ్ల జ్యోతి కుమారి అనే బాలిక, గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోపెట్టుకుని గురుగ్రామ్ నుంచి బిహార్ రాష్ట్రంలోని తమ సొంతూరు దర్భంగకు వెళ్లేందుకు ఏడు రోజులపాటు సుమారు 12,00 కి.మీ. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లింది. తండ్రిని కూర్చోపెట్టుకుని సైకిల్ తొక్కుతున్న జ్యోతి కుమారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు జ్యోతి పట్టుదలకు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ ఫోటో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ట్రంప్ కంట పడింది. దీంతో ఈ ఫోటోను ఇవాంక తన ట్వీట్టర్‌లో షేర్ చేస్తూ జ్యోతిపై ప్రశంసలు కురిపించింది. ‘జ్యోతి తన త్రండిపై చూపిన ప్రేమ, తన ఓర్పు.. భారతీయ ప్రజల‌ను, సైక్లింగ్ స‌మాఖ్య‌ను క‌ట్ట‌ప‌డేసింది’ అ‌ని ఇవాంకా పేర్కొన్నారు.

Ivanka Trump Praises Jyoti Kumari for Cycling 1200 km

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News