Home అంతర్జాతీయ వార్తలు మోడీకి థ్యాంక్స్ చెప్పిన ఇవాంకా ట్రంప్!

మోడీకి థ్యాంక్స్ చెప్పిన ఇవాంకా ట్రంప్!

ivanka-Trump

వాషింగ్టన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ప్రధాని నెదర్లాండ్ కి వెళ్లారు. ట్రంప్ తో సమావేశమైన మోడీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి, మరియు ఇతర కీలక అంశాల గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా, అసలు విషయానికొస్తే… ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్రంప్ కుమార్తె, ఆయనకు అత్యంత సన్నిహిత సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు కారణం ప్రధాని మోడీ ఆమెను ఈ ఏడాది భారత్‌లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సుకు ఆమెను ఆహ్వానించడమే కాక ఆ సదస్సుకు వచ్చే అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇవాంక నేతృత్వం వహించాలని మోడీ కోరడమే. భారత్‌లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌కు హాజరయ్యే అమెరికా పారిశ్రామిక వేత్తల బృందానికి నేతృత్వం వహించేందుకు నన్ను ఆహ్వానించిన ప్రధాని నరేంద్రమోదీకి నా కృతజ్ఞతలు’ ఇవాంక ట్వీట్‌ చేశారు.