Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ చంటికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ చంటికి గాయాలు

 

కోదాడ: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు చలాకి చంటి తీవ్రంగా గాయపడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగింది. జబర్దస్ షోలో నటించిన చంటి మంగళవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కోదాడ శివారులోని కోమరబండ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో చంటి గాయపడ్డాడు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం నుంచి అతడు తప్పించుకున్నాడు. స్థానికులు వెంటనే చంటిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చంటి స్వల్పంగా గాయపడడంతో హైదరాబాద్ కు బయలుదేరాడు. కారు ముందు భాగం ధ్వంసమైంది. జబర్దస్త్ షోతో చంటి కమెడియన్ గా గుర్తింపు పొందాడు. 

 

Jabardasth Fame Chalaki Chanti Injured In Road Accident