Home అంతర్జాతీయ వార్తలు భారతీయుడికి జాక్‌పాట్

భారతీయుడికి జాక్‌పాట్

DIRAMS

దుబాయ్ : అబుదాబి మెగా లాటరీలో ఓ భారతీయుడికి జాక్‌పాటి తగిలింది. గురువారం జరిగిన డ్రాలో కేరళకు చెందిన ఎంఎస్ మ్యాథ్యూ అనే వ్యక్తి బంపర్ బహుమతి గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో సుమారు 12 కోట్ల రూపాయల విలువైన ఏడు మిలియన్ దీరాంలు గెలుపొందాడు. ఈ డ్రాలో మరో ఆరుగురు భారతీయులు, ఒక ఎమిరేట్ వాసి కూడా లక్ష దీరాంలు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది. గత నెలలో అబుదాబి డ్రాలో కృష్ణంరాజు అనే తెలుగు వ్యక్తి యాబై లక్షల దీరాంలు గెలుచుకున్నారు.

Jackpot to Indian