Friday, April 26, 2024

జీవితం అనేది చాలా చిన్నది

- Advertisement -
- Advertisement -

Jacqueline Fernandez says Life is too short

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో తాను ఎంతో నేర్చుకున్నానని బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ పేర్కొంది. తనకు జీవిత పాఠం నేర్పించడంలో లాక్‌డౌన్ సమయం ఎంతో ఉపయోగపడిందని ఈ బ్యూటీ చెప్పింది. “కరోనా కారణంగా జీవితం అనేది చాలా చిన్నదని నాకు అర్థమైంది. ప్రతి రోజు చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు మనకు జన్మనిచ్చిన భూమికి ఏదైనా చేయాలని అనిపించింది. మనం ప్రతి రోజు కూడా మన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో తోటి వారికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ ముందుకు వెళ్లాలి”అని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News