Friday, April 19, 2024

పవర్‌స్టార్‌కు జోడీగా…

- Advertisement -
- Advertisement -

Jacqueline Fernandez will star opposite Pawan Kalyan

 

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ కూడా ఒకటి. భారీ పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కుతున్న దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రంలో మరో హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ కూడా నటించనుందట. తాజాగా ఆమె తన రోల్‌పై ఓ క్లారిటీ ఇచ్చింది. జాక్విలిన్ తాజా గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఈ చిత్రంలో ఓ రాకుమారి పాత్రలో కనిపిస్తానని చెప్పుకొచ్చిందట. అలాగే పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి కూడా బాగా ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ సద్దుమణిగాక ఈ చిత్రం షూట్ మొదలు పెట్టనున్నారని మరో క్లారిటీ కూడా ఇచ్చింది. మరి జాక్విలిన్ ఇది వరకే ప్రభాస్ ‘సాహో’లో హాట్ ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News