Tuesday, April 23, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్… రెండో స్థానంలో జడేజా

- Advertisement -
- Advertisement -

Jadeja reach second rank in Test

దుబాయ్‌: ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ స్టార్‌ రవీంద్ర జడేజా(386 రేటింగ్‌ పాయింట్లు) సెకండ్ ర్యాంకు లో కొనసాగుతున్నాడు. జడ్డూ రెండో స్థానంలో నిలబెట్టుకోవడంతో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌(385 పాయింట్లు) మూడో స్థానానికి పడిపోయాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ 423 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ సెకండ్‌ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు.

మరోవైపు ఐసిసి టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నారు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(814 పాయింట్లు), రిషబ్‌ పంత్‌(747), రోహిత్‌ శర్మ(747) వరుసగా 5, 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. టెస్టుల్లో న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News