Home అంతర్జాతీయ వార్తలు జాదవ్ క్రిమినలే … ఇమ్రాన్ ఖాన్

జాదవ్ క్రిమినలే … ఇమ్రాన్ ఖాన్

Imran Khanఇస్లామాబాద్ : గూఢచార్యం కేసులో పాక్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ క్రిమినల్ అని, పాక్ ప్రజల పట్ల నేరం చేసిన అతడిని వదిలి పెట్టబోమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. జాదవ్ కు పాక్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసిజె) బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ సాధించిన పెద్ద విజయమని పేర్కొన్నారు. ఐసిజె ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. జాదవ్ ను విడిచి పెట్టమని, ఆయన్ను ఇండియాకు పంపించాలని ఐసిజె తమకు చెప్పలేదని, ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేస్తామని, చట్ట ప్రకారం ముందుకు వెళుతామని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

Jadhav Criminal : Pak PM Imran Khan