Friday, March 29, 2024

మృత్యు మలుపు

- Advertisement -
- Advertisement -

రోడ్డు పక్కనున్న కాలువలో పడిన వాహనం నలుగురు అక్కడికక్కడే
మృతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృత్యువాత
సిద్దిపేట జిల్లాలో దుర్ఘటన మృతులంతా సమీప బంధువులు

మన తెలంగాణ/జగదేవ్‌పూర్ : కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి పక్కనే గల గోతిలో పడడంతో ఆరుగురు వ్యక్తులు మృత్యువాత పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో చోటు చేసుకుం ది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు మహిళలతోసహా మొత్తం ఆరుగురు చనిపోయా రు. సిఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన నలుగురు, బొ మ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన ఇద్దరు ఉన్నారు. మృతుల్లో బొల్లు సమ్మ య్య(38), బొల్లు స్రవంతి(32), రాజామణి (45), భవ్యశ్రీ(15),లోకేష్(12), వెంకటేశ్ (50) లు దైవదర్శనం కోసం కారులో వీరంతా వేములవాడ రాజరాజేశ్వర స్వా మిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న క్రమం లో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

మునిగడప గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద పెద్ద మూలమలుపు వద్ద కొడకండ్ల నుంచి జగదేవ్‌పూర్‌వైపు
వెళుతున్న కారు మూల మలుపు తిరగ్గానే అదుపుతప్పి ముందు ఉన్న కొండపోచమ్మ కాలువ బ్రిడ్జిని ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తి గజ్వేల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చినిపోయాడు. కాగా, మరో క్షతగాత్రుడు వెంకటేషన్‌ను తొలుత గజ్వేల్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సాయంత్రం చనిపోయాడు. మృతదేహాలను పోలీసులు, పంచాయతీ సిబ్బంది, స్థానికుల సహకారంతో కాలువ నుంచి పైకితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. కాగా, రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు దైవదర్శనానికి వెళ్లి ఇలా మృత్యువాత పడటంతో బొమ్మల రామారం, మాల్యాల గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News