Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఒక్కొక్కరికి రూ.7 లక్షల పరిహారం: జగన్

ఒక్కొక్కరికి రూ.7 లక్షల పరిహారం: జగన్

AP-CM-Jaganఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు జగన్ ప్రభుత్వం పరిహరం ఇవ్వనుంది. ఒక్కొక్కరికి రూ.7లక్షల పరిహరం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటివరకు 1,513 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డుల్లో నమోదు అయింది. అయితే, గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం చెల్లించింది.

మిగిలిన వారితో పాటు ఇంకా ఎవరైనా అర్హులున్నా వారిని గుర్తించి, జిల్లా కలెక్టర్లు నేరుగా బాధిత రైతు కుటుంబం దగ్గరికి వెళ్లి పరిహారం అందించాలన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని, మానవత్వం ఉన్న ప్రభుత్వమని.. ఈ దిశగానే పాలన ఉంటుందన్నారు జగన్. చనిపోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతితో ఉండాలన్న ఆయన మానవత్వంతో మెలగాలన్నారు. మనిషే చనిపోయాడు ప్రభుత్వం కూడా అండగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని సిఎం జగన్ పేర్కొన్నారు.

jagan decides Rs 7 lakhs compensation for suicide farmers