Friday, April 26, 2024

పేదల తలరాత మారాలంటే చదువనే ఆస్తి ఉండాలి: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంగ్లిష్ మీడియం వద్దని కోర్టులకు వెళ్లే దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బాపట్లలో సిఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. యడ్లపల్లి హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. 4.59 లక్షల మంది విద్యార్థులకు 59176 ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. పేదల తలరాత మారాలి అంటే చదువు అనే ఆస్తి ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకునేలా చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వ స్కూళ్లలోనూ డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదా?అని జగన్ ప్రశ్నించారు. పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసిందన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక అంతరాలు తొలగించే చర్యలు తీసుకున్నామని, చదువులో సమానత్వం ఉంటే ప్రతి కుటుంబం అభివృద్ధిని అందుకోగలదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News