Home జాతీయ వార్తలు మాజీ రాజస్థాన్ సిఎం భార్య కన్నుమూత

మాజీ రాజస్థాన్ సిఎం భార్య కన్నుమూత

jagannath pahadia wife passed away

జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా భార్య శాంతి పహాడియా ఆదివారం కన్నుమూశారు. జగన్నాథ్ పహాడియా 3 రోజుల క్రితం కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పహాడియా భార్య మాజీ ఎమ్మెల్యే శాంతి పహాడియా గురుగ్రామ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. శాంతి పహాడియా మరణ వార్త విన్న జిల్లా ప్రజలు ప్రజలు 2 నిమిషాలు మౌనంగా ఉండి నివాళులు అర్పించారు. శాంతి పహాడియా రెండుసార్లు ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. శాంతి పహాడియా మృతికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, గోవింద్ సింగ్ దోతసర, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సంతాపం తెలిపారు.

jagannath pahadia wife passed away