Thursday, March 28, 2024

సైబరాబాద్ పోలీసులకు మాస్కులు అందజేసిన జగపతిబాబు

- Advertisement -
- Advertisement -

Jagapathi Babu

 

మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న సైబరాబాద్ పోలీసుల రక్షణ కోసం సినీహీరో జగపతిబాబు ఎన్95 మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్‌ను కలిసి వాటిని అందజేశారు. పోలీసులు లాక్‌డౌన్ విధులు అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని హీరో జగపతిబాబు అన్నారు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు వాటిని అందజేయాలని కోరారు. పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందజేసిన జగపతిబాబును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు.

 

Jagapathi Babu who given masks to Police
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News