Home తాజా వార్తలు 10 వేల మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

10 వేల మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

Jagapatibabu supplies essential commodities

 

కరోనా లాక్‌డౌన్‌తో సినీ కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. విలక్షణ నటుడు జగపతిబాబు లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసర సరుకులకు అందజేస్తున్నారు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి.సజ్జనార్‌ను కలిసి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్న పోలీసుల కోసం ఎన్ 95 మాస్క్‌లు, శానిటైజర్లను అందజేశారు. అయితే ఇప్పటివరకు పది వేల మందికి జగపతిబాబు నిత్యావసర సరుకులను అందజేయడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పది వేల మంది సినీ కార్మికులు, పేదలకు నిత్యావసర సరుకులను అందజేశాను. తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న వారిని ఆదుకోవడంతో ఎంతో సంతోషంగా ఉంది”అని అన్నారు.