Friday, March 31, 2023

హరితహారం లక్ష్య సాధనకు కృషి చేయాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్

- Advertisement -

take
మనతెలంగాణ/జగిత్యాల: హరితహారం లక్ష సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ కార్యాలయంలో తెలంగాణకు హరితహారం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, తెలంగాణకు హరితహారం 2018—19లో జిల్లాలో 1.40 కోట్ల మొక్కలు నాటాలని లక్షంగా నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామీణాభివృదిద శాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 69 నర్సరీల ద్వారా జిల్లాలో నాటాల్సిన మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లోకేషన్, గ్రామ పంచాయతీ, మండల, నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి సంబంధిత అధికారులకు లక్షాలను నిర్ణయించుకోవాలన్నారు. హరితహారంలో పూలు, పండ్ల మొక్కలు, నీడ ఇచ్చే మొక్కలు, ఔషద మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నర్సరీల్లో మొక్కల పెంపకం పనులను వేగవంతం చేసి ప్రగతిని చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత సంవత్సరం నాటిన మొక్కలకు 100 శాతం జియో ట్యాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఎంపిడిఓలు, ఉపాధి హామీ సిబ్బంది, ఇతర మండల, గ్రామ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ నోడల్ అధికారులు లోకేషన్ ఇంచార్జిలతో సమావేశం ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి సోమవారం హరితహారం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించడం జరుగుతుందన్నారు. ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు ఎస్‌ఆర్‌ఎస్‌పి, వరద కాల్వలకు ఇరు వైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని మండల అభివృద్ది అధికారులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి నర్సింహారావు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, డిఆర్‌డిఎ అదనపు పిడి లక్ష్మీనారాయణ, సుందరవరదరాజన్, నర్సింహులు, జిల్లా స్థాయి అధికారులు, మండల పరిషత్ అభివృద్ది అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News