Home జగిత్యాల చేయని తప్పుకు… దుబాయి జైళ్లో…

చేయని తప్పుకు… దుబాయి జైళ్లో…

Jail sentence for immigrants in Dubai

 

జగిత్యాల: ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్‌కు వెళ్లిన ఓ వలసజీవి అనుకోని ప్రమాదంలో ఇరుక్కొని జైలు పాలైన ఉదంతమిది. రాయికల్ మండలం మూటపెల్లి గ్రామానికి చెందిన పడిగెల రాజం మే 7వ తేదీన షార్జాలోని జైలు గోడల మధ్య బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నాడు. తాను గల్ఫ్‌కు వెళ్లుతున్న విషయం తెలుసుకున్న తోటి స్నేహితుల కుటుంబీకులు పంపిన మెడిషన్ తన పాలిట శాపంగా మారినట్లు పోలీసులు చెప్పడంతో రాజం కన్నీటి పర్యంతమౌతున్నాడు. తాను తీసుకెళ్లుతున్న లగేజీలో మెడిషన్ ఉన్నట్లు గ్రహించిన అక్కడి పోలీసులు రాజంను షార్జా ఏయిర్‌ఫోర్టులోనే పట్టుకొని జైలుకు తరలించారు.  రాజం జైలు పాలైన సంఘటన తెలుసుకున్న అతని బంధువులు ఈ నెల 11న స్వగ్రామంలోని కుటుంబీకులకు చెప్పడంతో వారు కన్నీటి పర్యంతమౌతున్నారు.

చేయని తప్పుకు జైలులో పడ్డ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని విడిపించేలా చూడాలని జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్‌కుమార్, ఎంఎల్ సి తాటిపర్తి జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లి వేడుకున్నారు. దుబాయిలోని డట్కో కంపెనీలో వాచ్‌మెన్‌గా చాలాకాలంగా పని చేస్తున్న రాజం పలుమార్లు ఇండియాకు వచ్చి వెళ్లుతుండే వాడని, కుటుంబ సభ్యులు పంపిన మందులు తాను తీసుకెళ్లే లగేజీలో దొరకడంతో ఈ మందులు తన పాలిట శాపంగా మారతాయని గ్రహించకపోవడంతో ఇబ్బందులు తప్పలేదని తెలుస్తుంది. కాగ భారత విదేశాంగ అధికారులను కలిసి తన భర్తను విడిపించాలని రాజం భార్య లత, ఇద్దరు పిల్లలు కన్నీళ్లతో వేడుకుంటున్నారు.

Jail sentence for immigrants in Dubai