Home జాతీయ వార్తలు కశ్మీరులో జైషే మొహమ్మద్ కమాండర్ హతం

కశ్మీరులో జైషే మొహమ్మద్ కమాండర్ హతం

Jaish-e-Mohammed commander killed in Kashmir

శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్(జెఇఎం) కమాండర్ షామ్ సోఫి బుధవారం జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. అవంతిపురలోని ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా..ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని, ఈ కాల్పులలో షామ్ సోఫి మరణించాడని ఐజి(కశ్మీరు) విజయ్ కుమార్ తెలిపారు.