Home Default లోక్ సభలో జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల బిల్లు

లోక్ సభలో జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల బిల్లు

Lok Sabhaఢిల్లీ :  జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభ సోమవారం ప్రవేశ పెట్టారు. జమ్ములో అంతర్జాతీయ సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో, కశ్మీర్ లో నియంత్రణ రేఖకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాలయాల్లో రిజర్వేషన్లు కలిపించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. అదేవిధంగా ఆదార్ చట్ట సవరణ బిల్లు2019ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపిలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఆందోళన మధ్యనే ఈ బిల్లుపై రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఇదిలా ఉండగా ప్రత్యేక ఆర్థిక జోన్ల సవరణకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.

Jammu and Kashmir Reservation Bill In Lok Sabha