Home జాతీయ వార్తలు జమ్మూ కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి (370 అధికరణ) రద్దు!

జమ్మూ కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి (370 అధికరణ) రద్దు!

 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీరుపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీరుకు వర్తింపచేస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని (రాజ్యాంగంలోని 370వ అధికరణను) రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. జమ్మూ కాశ్మీరును రెండు కేంద్ర ప్రాంతాలుగా విభజస్తున్నట్లు ప్రతిపాదిస్తూ ఒక తీర్మానాన్ని అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీరు ఇక రాష్ట్రంగా ఉండబోదని కేంద్రం ప్రతిపాదించింది. ఇక జమ్మూ కాశ్మీరు శాసనసభతో కూడిన కేంద్రం పాలిత ప్రాంతంగా ఉంటుంది. అదే విధంగా లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

 

Jammu Kashmir no longer a state, Centre has declared Jammu Kashmir and Ladakh to be Two Union Territories