Saturday, April 20, 2024

జమ్ములో రికార్డు వర్షపాతం

- Advertisement -
- Advertisement -

Jammu recorded 50.1 mm of rainfall

జమ్ము: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో అల్లాడుతున్న జమ్ములో బుధవారం ఒకే ఒక్క రోజు నగరంలో 50.1 మి.మీ వరకు గరిష్ఠ స్థాయిలో వర్షం కురిసింది. గత ఇరవై ఏళ్లలో జనవరి నెలలో ఇంతభారీ వర్షం కురియడం రెండోసారి. 2000 జనవరి 13న 81.4 మి.మీ వర్షం కురిసినట్టు రికార్డు ఉంది. 2017జనవరి 26న 47.7 మి.మీ వర్షం రికార్డయింది. భారీ వర్షాలతో తావి నది ఉప్పొంగినా, ప్రమాదస్ధాయికి దిగువనే ప్రవహిస్తోంది. జమ్ముశ్రీనగర్ జాతీయ రహదారి పక్కనున్న బనిహాల్ పట్టణంలో గత 24 గంటల్లో 80.4 మి.మీ వర్షం కురిసింది.

Jammu recorded 50.1 mm of rainfall

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News