Home తాజా వార్తలు జానాకు ఓటమి తప్పదు: నోముల

జానాకు ఓటమి తప్పదు: నోముల

Nomula-Narasimaiah

నల్లగొండ: ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని నోముల నర్సింహయ్య తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేత జానారెడ్డి 24 గంటలు కరెంటు కెసిఆర్ ఇస్తే టిఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తానని గతంలో అన్నారని, ఆ మాట ప్రకారం తమ పార్టీకి ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. బత్తాయి రైతులు ఆనందంగా ఉన్నరా లేరా అనేది జానానే చెప్పాలని నిలదీశారు. జానా టిఆర్‌ఎస్‌లోకి వస్తే టిక్కెట్ త్యాగం చేస్తానని నోముల సవాలు విసిరారు. ఎన్నికలంటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రసంశించారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకుంటున్నది కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ్ జిల్లాలో 12 స్థానాలు టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.