Wednesday, April 24, 2024

టి 20 వరల్డ్ కప్ లో భారత్ కొసమెరుపు

- Advertisement -
- Advertisement -

మెల్‌బౌర్న్ : ఆదివారం జరిగే టి20 వరల్డ్ కప్ క్రికెట్ ఆటలో ఓటమితో భారత క్రికెట్ జట్టు ఇంటిబాట పట్టింది. ఈ ఫైనల్‌లో భారత్ ఆటకు చోటు లేకపోయినా ఈ వేదిక నుంచి 13 ఏండ్ల భారతీయ సంతతి బాలిక జానకి పాట మార్మోగనుంది. ఈ వేడుకల షోలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. టి 20 ముగింపు అట్టహాసంగా నిర్వహించే క్రమంలో జానకి ఈశ్వర్ ఆస్ట్రేలియా రాక్‌బ్యాండ్ ఐస్‌హోస్ బృందంతో కలిసి షో చేస్తుంది. అతి చిన్న వయస్సులోనే ఈ భారతీయ సంతతి బాలిక ది వాయిస్ రియాల్టీ షోతో ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.

ఇప్పుడు ఇండియా ఔట్ అయ్యి పాకిస్థాన్ ఇంగ్లాండ్ మధ్య సాగే తుదిపోరు తరువాతి వీడ్కోలు వేడుకలో షోలో తన ప్రతిభ చాటుకుంటుంది. ఐస్‌హౌస్ రాక్ బృందం పైగా వరల్డ్ కప్ ఇటువంటి నేపథ్యంలో తన షో తనకు దక్కిన భలే ఛాన్స్ అని జానకి తెలిపింది. అతి పెద్ద ఎంసిజి గ్రౌండ్‌లో ప్రదర్శనకు దిగుతున్నానని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ షోను తిలకించడం తల్చుకుంటేనే తనకు బోలెడు సంతోషాన్ని ఇస్తోందని ఈ బాలిక తెలిపింది.

తన తల్లిదండ్రులు వీరస్థాయిలో క్రికెట్ ఫ్యాన్స్‌అని , వారి అభిరుచులు ప్రోత్సాహంతోనే తాను ఇప్పుడు తానీ అవకాశం దక్కించుకున్నానని జానకి తెలిపింది. ఈ ఫైనల్‌లో ఇండియా ఉండి ఉంటే మరింత బాగుండేదని తనకు అన్పిస్తోందని బాధపడింది. జానకి తల్లిదండ్రులు అనూప్ దివాకరన్, దివ్య రవీంద్రన్‌లది కేరళలోని కోజికోడ్. వీరి కుటుంబం గత 15 ఏండ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటోంది. కూతురు ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆమెకు తల్లిదండ్రులు భారతీయ సంగీతం పట్ల ఆసక్తి నేర్పించారు. కర్నాటక సంగీతం నేర్చుకుంది. ఆస్ట్రేలియాలో రాక్‌బ్యాండ్‌తో కలిసి పాటలు పాడే దశకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News