Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కేన్సర్ తో బాధపడుతున్న అభిమానికి పవన్ ఆర్థిక సాయం

కేన్సర్ తో బాధపడుతున్న అభిమానికి పవన్ ఆర్థిక సాయం

Pawan Kalyanహైదరాబాద్ : కేన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని పాతకూటి బూడిగయ్యకు జనసేన చీఫ్, నటుడు పవన్ కల్యాణ్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. బూడిగయ్య త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షిస్తూ వినాయకుడి విగ్రహాన్ని అందించారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రానికి చెందిన బూడిగయ్య పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తనకు కేన్సర్ వచ్చినప్పటికీ జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇటీవల బూడిగయ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని స్థానికంగా  ఉండే జన సేన నేతలకు బూడిగయ్య చెప్పాడు. దీంతో వారు ఈ విషయాన్ని పవన్ కు తెలిపారు. ఈ క్రమంలో బూడిగయ్యను హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లో ఉన్నజనసేన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ పవన్ బూడిగయ్యను పరామర్శించారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు, తన అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటానని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Janasena Chief Pawan Kalyan Visitation To Fan