Home జాతీయ వార్తలు జంతర్ మంతర్‌లో ‘దిశ’ హత్యపై తీవ్ర నిరసన

జంతర్ మంతర్‌లో ‘దిశ’ హత్యపై తీవ్ర నిరసన

Jantar Mantar Protest

 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన పశువైద్యురాలు దిశపై దారుణ అత్యాచారం, కిరాతకంగా జరిగిన హత్యను ప్రతిఘటిస్తూ సోమవారంనాడు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద డజన్లకొద్ది ప్రజలు నిరసన ప్రదర్శన జరిపారు. నల్లటి బ్యాండ్‌లు ధరించి ‘మాకు న్యాయం కావాలి’, ‘రేపిస్టులను ఉరితీయాలి అని నినాదాలున్న ప్లకార్డులు పట్టుకొని 40 50 మంది వీధుల్లోకి వచ్చారు. ఆందోళన నిర్వాహకులు అమృతా ధావన్ మాట్లాడుతూ ‘రాజకీయ నాయకురాలిగా నేను ఆందోళనను నిర్వహించడం లేదు.

మన సమాజంలో జరుగుతున్న ఘటనల గురించి ఆలోచించే సమాజంలోని ఒక వ్యక్తిగా ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాను. మహిళలకు ఎంతవరకు భద్రత ఉందో చెప్పడానికి మనకు మరో నిర్భయ అవసరం ఎందుకు?’ అని ఆమె ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ సత్వర న్యాయం అందించాలి. అప్పుడే బాధిత కుటుంబాలకు కొంత ఊరట లభిస్తుంది. నిర్భయపై అత్యాచారం చేసిన వారిని ఇంతవరకు ఉరితీయలేదు. వాళ్లింకా జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉన్నవారు తింటూ, నిద్రపోతూ హాయిగా ఉన్నారు. శాశ్వతంగా జీవితాలు నాశనమైన బాధిత కుటుంబాల సంగతేమిటి?’ అని ఆమె నిలదీశారు.

Jantar Mantar during Protest on Disha Rape and Murder