Thursday, March 28, 2024

సాగరకన్యలా మెరిసింది

- Advertisement -
- Advertisement -

Janvi Kapoor hot photo shoot

 

ఇండియన్ సినిమా చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న అందాల తార శ్రీదేవి. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా మారారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి… బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె అనుకోకుండా కన్నుమూశారు. ఇక ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా ‘దడక్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన తల్లి శ్రీదేవి తరహా స్టార్ ఇమేజ్ కోసం ఈ యంగ్ బ్యూటీ పరితపిస్తోంది. ఇక జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తనదైన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ ఫా లోవర్స్ ఉన్నారు. సీజన్‌ను బట్టి రకరకాల ఫొటోషూట్‌లు చేసే జాన్వీ కపూర్ తాజాగా ఒక మ్యాగజైన్ కోసం సాగరకన్యలా మారిపోయిం ది. వెస్టిన్ మాల్దీవుల్లోని మిరియాంధూ రిసార్ట్‌లో ఆమె కెమెరాకి ఫోజులు ఇచ్చింది. భారతదేశంలో కోవిడ్ -సెకండ్ వేవ్‌కు ముందు ఈ ఫోటోషూట్ జరిగింది. జాన్వీ కపూర్ ఈ ఫోటోలలో మత్స్యకన్యలా కనిపిస్తోంది. మరికొన్ని ఫోటోలలో బికినీలో కనిపిస్తూ రచ్చ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News