Wednesday, September 18, 2024

జపాన్‌లో విదేశీయుల ప్రవేశంపై నిషేధం

- Advertisement -
- Advertisement -
Japan bans entry of all foreign visitors
ఇజ్రాయెల్, మొరాకో దేశాలు అదే బాటలో
ఒమిక్రాన్ దృష్టా ముందుజాగ్రత్తలు

టోక్యో : ప్రపంచ దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్టా విదేశాల నుంచి వచ్చే వారిని తమ దేశంలో ప్రవేశించరాదని జపాన్ సోమవారం వెల్లడించింది. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి అమలు లోకి వస్తాయి. జపాన్‌లో ఇంతవరకు ఒమిక్రాన్ కేసు ఏదీ బయటపడక పోయినప్పటికీ మళ్లీ సరిహద్దుల్లో ఆంక్షలు విధించింది. ఈ నెల మొదట్లో స్వల్పకాల సందర్శనకు వ్యాపారస్తులకు, విదేశీ విద్యార్థులకు వర్కర్లకు అనుమతించినప్పటికీ మళ్లీ ఆంక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని దేశాలు ఇదివరకు సడలించిన ఆంక్షలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఆంక్షల సడలింపులో ఉన్నాయి. జపాన్‌లో పరిస్థితి అధ్వాన్నంగా మారకుండా ఉండేందుకు అత్యవసర జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రధాని ఫుమియో కిషిడా చప్పారు.

ఒమిక్రాన్ గురించి పూర్తి వివరాలు అందేవరకు ప్రజలు కరోనా నియంత్రణ నిబందనలు పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రధాని కిషిడా కోరారు. కరోనా వైరస్ నియంత్రణలో వైఫల్యం చెందాననే అసంతృప్తితో అంతకు ముందటి ప్రధాని పదవిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒమిక్రాన్ గురించి వివరాలు అందేవరకు తాను ఒక్కడినే దూకుడుగా ఎలాంటి చర్య తీసుకోనని కిషిడా ప్రకటించారు. ఇజ్రాయెల్ , మొరాకో దేశాలు విదేశీయుల ప్రవేశాన్ని రద్దు చేశాయి. సోమవారం నుంచి రెండు వారాల పాటు విమానాలు తమ దేశానికి రావడాన్ని రద్దు చేసినట్టు మొరాకో ప్రకటించింది. నెదర్లాండ్స్‌లో 13 కేసులు, కెనడాలో 2 కేసులు ఇంతవరకు బయటపడ్డాయి. ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీలో ఒమిక్రాన్ మొదటి కేసు బయటపడినట్టు ఆస్ట్రేలియా ఆరోగ్య అధికార వర్గాలు సోమవారం ప్రకటించాయి. న్యూసౌత్ వేల్స్‌లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదైందని ప్రీమియర్ డొమినిక్ పెర్రోటెట్ సోమవారం వెల్లడించారు.

ఒమిక్రాన్ భయంతో తొమ్మిది దక్షిణాఫ్రికా దేశాల నుంచి విదేశీయుల రాకను న్యూజిలాండ్ రద్దు చేసింది. ఆక్‌లాండ్‌కు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రకటించింది. బార్లు, రెస్టారెంట్లు, జిమ్స్ యధావిధిగా గురువారం నుంచి ప్రారంభమౌతాయని ప్రధాని జెసిండా ఆర్డెమ్ చెప్పారు. ఆక్‌లాండ్‌లో ఆగస్టు నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్ ఇప్పటికి ముగుస్తోంది. మలేసియాలో కొన్ని పరిమితులు తప్ప ఎలాంటి ఆంక్షలు లేవు. సింగపూర్‌లో పనిచేస్తున్న మలేసియన్లు ఆనందంతో తిరిగి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. కరోనా తో రెండేళ్లుగా మూసివేసిన సరిహద్దుల్ని ఇప్పుడు పాక్షికంగా తెరిచారు. మలేసియా ద్వీపానికి సింగపూర్‌కు మధ్య వారధిగా ఉన్న కాజ్‌వే బ్రిడ్జి మీదుగా బస్సులు తిరుగుతున్నాయి. తైవాన్ సరిహద్దుల్లో ప్రవేశాలను కట్టుదిట్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణకు మరిన్ని ఆంక్షలు ఇంకా విధించలేదని తైవాన్ వెల్లడించింది. ఉత్తర కొరియా తమ దేశంలో ఇంతవరకు ఎలాంటి కేసులు లేవని వివరించింది. ఒమిక్రాన్ కానీ మరే వేరియంట్ కానీ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News