Wednesday, April 24, 2024

పతకాల వేటలో జపాన్ జోరు..

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఆతిథ్య దేశం జపాన్ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండిస్తోంది. అమెరికా, చైనా దేశాలను సైతం వెనక్కినెట్టి జపాన్ స్వర్ణాల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రపంచ క్రీడల్లోనే ఎదురులేని శక్తులుగా పేరు తెచ్చుకున్న అమెరికా, చైనాలు కూడా పోటాపోటీగా స్వర్ణాలు సాధిస్తూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ దేశాలను వెనక్కి తోసి ప్రస్తుతం స్వర్ణాల సాధనలో అగ్రస్థానంలో నిలువడం విశేషం. బుధవారం క్రీడలు ముగిసే సమయానికి జపాన్ 13 స్వర్ణాలు, నాలుగు రజతాలు, మరో ఐదు కాంస్య పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా 12 పసిడి పతకాలు, ఆరు రజతాలు, మరో 9 కాంస్యలతో 27 పతకాలను తన ఖాతాలో వేసుకుని రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక అమెరికా 11 స్వర్ణాలు, మరో 11 రజతాలు, 9 కాంస్యలతో 31 పతకాలు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోది. రష్యా ఒలింపిక్ కమిటీ 7 స్వర్ణాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

Japan leads in Tokyo Olympics medals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News