Thursday, April 25, 2024

జపాన్‌లో జననాలు తక్కువ, మరణాలు ఎక్కువ!

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్‌లో జననాల రేటు గణనీయంగా పడిపోతున్నాయి. మరోవైపు మరణాల రేటు పెరిగిపోతోంది. ఇలాగే కొనసాగితే జపాన్ అదృశ్యమవుతుందని ఆ దేశ ప్రధాన మంత్రి సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనన, మరణాలకు సంబంధించిన గత ఏడాది నివేదికలు వెల్లడైన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. జననాల రేటుకు సంబంధించిన ఓ నివేదికను జపాన్ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. గత ఏడాది జననాల రేటు గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంది. ఓ ఇంటర్వూలో దీనిపై జపాన్ ప్రధానమంత్రి సలహాదారు మసాకో మోరీ ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఏడాది జపాన్‌లో ఎనిమిది లక్షల జననాలు రికార్డు కాగా, మరణాలు మాత్రం 115.8 లక్షలు నమోదయ్యాయి. 2008 నుంచి ప్రస్తుతానికి జపాన్ జనాభా 4 కోట్లు తగ్గిపోయింది. జపాన్‌లో జనాభా పెరుగుదల కనిపించడం లేదనే చెప్పాలి. పనిచేసే యువత భవిష్యత్తులో లేకుంటే పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. సామజిక వ్యవస్థ కుప్పకూలవచ్చు. జపాన్‌లో జనాభా క్షీణతకు తగు ప్రణాళికలు చేపట్టి అరికట్టాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News