Home తాజా వార్తలు జపాన్ ఒలింపిక్స్‌లో రోబోలతో అతిథి మర్యాదలు

జపాన్ ఒలింపిక్స్‌లో రోబోలతో అతిథి మర్యాదలు

Robotటోక్యో: వచ్చే వేసవిలో జపాన్‌లో జరిగే ఒలింపిక్ క్రీడోత్సవాలకు అన్ని పనులు చేయగల రోబోలను సిద్ధం చేస్తున్నారు. ప్రేక్షకులను, అతిధులను ఆహ్వానించడం దగ్గర నుంచి సామగ్రిని రవాణా చేసే వరకు రోబోలే పర్యవేక్షించడం ప్రత్యేకత. ఈ క్రీడోత్సవాల్లో తమ సాంకేతిక ప్రావీణ్యాన్ని చాటుకోవాలన్న ఆకాంక్షతో జపాన్ ఉవ్విళ్లూరుతోంది. పారిశ్రామిక విప్లవానికి ఆవిష్కరణలకు నూతన అధ్యాయం సృష్టించిన జపాన్ చాలా సంవత్సరాల తరువాత తన సాంకేతిక ప్రతిభను అద్భుతంగా ఆవిష్కరించడానికి ఈ ఒలింపిక్ క్రీడలను వేదికగా చేసుకోవాలని జపాన్ ప్రయత్నిస్తోంది.

ఆటో దిగ్గజం టొయోటా సంస్థ ఈమేరకు ఐదు రోబోలను రూపొందించింది. ఇవి వివిధ వైవిధ్య పాత్రలను నిర్వర్తిస్తాయి. ఒలింపిక్ మస్కట్స్ నుంచి రవాణా వాహనాల వరకు వీటి రూపాలుంటాయి. వీటన్నిటిలో చిన్నపిల్లల సైజులో ఉండే రోబోలు, పారాలింఫిక్ మస్కట్స్ అమితంగా ఆకర్షిస్తాయి. రిమోట్ ద్వారా నియంత్రించ బడే మస్కట్ రోబోలకు నీలం లేదా ఊదా రంగు ఉండి పెద్ద కళు,్ల నిక్కబొడిచే చెవులు అనేక కీళ్లు, భుజాలు అమర్చి ఉంటాయి. చాలా చిన్నవిగా ఉండే ఇవి కదల లేవు, మాట్లాడ లేవు. వాటి తలలో అమర్చిన కెమెరా ప్రేక్షకులతోను, క్రీడాకారుల తోను అనుసంధానం కావడానికి తోడ్పడుతుందని టొయోటా అధికార ప్రతినిధి తొమోహిషా మొయిరడెయిరా చెప్పారు. ప్రజల భావాలను అవి గ్రహించి తిరిగి తగినట్టు స్పందిస్తాయని తెలిపారు. ఎవరైనా వాటి నుంచి కదలి వెళ్తుంటే అవి విచారంగా చూస్తాయని చెప్పారు.

మస్కట్స్ హావభావాలన్నీ వాటి కళ్ల లోనే వ్యక్తమవుతుంటాయని, ఉద్వేగాల బట్టి హృదయాలను, నక్షత్రాలను ప్రదర్శిస్తాయని వివరించారు. ఆటలతో పిల్లల్ని అలరిస్తాయి. సూట్‌కేసు సైజులో చక్రాలపై ఉండే రోబో ఒలింపిక్ సిబ్బందికి పనుల్లో సహకరిస్తుంది. సరకులను లోడ్ చేయడంలో, రవాణా చేయడంలో అడ్డంకులు ఉంటే తొలగింప చేస్తుంది. ఈవెంట్స్ లో ఏపని ఆలస్యం కాకుండా నెరవేర్చ గలిగేలా చూడడంతోపాటు సిబ్బందిని తగ్గించేలా చూస్తుందని టొయొటా వెల్లడించింది. క్రీడలకు హాజరు కాని వారి కోసం చక్రాలతో కూడిన కెమెరాతో మనిషి అంత ఆకారంలో తెర ఉండి ఆటలను చూపిస్తుంది.

Japan to Use Robot Assistants in 2020 Olympics

 సైన్స్ విభాగం