Home ఎడిటోరియల్ భారత్‌పై జపాన్ గురి కుదిరింది

భారత్‌పై జపాన్ గురి కుదిరింది

modiవిశ్వాసమే కీలకం. టెక్నాలజీ బదిలీకి, పెద్ద ఎత్తున పెట్టుబడులకు భారతదేశం పూర్తిగా విశ్వ సించదగినదని జపాన్ ప్రధాని షింజో అబె అంతిమంగా గుర్తించారు. ప్రభుత్వ యాజమాన్యం లోని మారుతీ ఉద్యోగ్‌లో చిన్నకార్ల ఉత్పత్తికై పెట్టు బడి భాగస్వామ్యానికి ఒసామో సుజుకి భారత దేశాన్ని ఎంచుకున్న పాతికేళ్ల తర్వాత, పౌర అణుశక్తి సహకారం కొరకు భారత్‌తో సహకరించవచ్చునని జపాన్ అంతిమంగా విశ్వసించింది. ఆర్థిక, టెక్నాలజీ సహకారానికి అమెరికా వెలుపల అత్యంత విశ్వసనీయమైన దేశం నెమ్మదిగా, నిలకడగా ప్రజా స్వామ్యపథంలో ముందుకు సాగుతున్న భారత్ అని జపాన్ ఈ రోజున అర్థం చేసుకుంది. భారత్‌లో ఒకే ఒక ప్రాజెక్టుకు – 550 కి.మీ. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు సర్వీసు-12 బిలియన్ డాలర్లు దీర్ఘకాలిక రుణం ఇచ్చేందుకు జపాన్ ముందుకు రావటంతోపాటు రక్షణరంగంలో టెక్నాలజీ బదిలీకి అంగీకరించింది. వీటితోపాటు సంతకాలు చేసిన మరో 14 ఆర్థిక సహకార ఒప్పందాలు – పురోభివృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌పట్ల జపాన్‌లో పెరుగుతున్న నమ్మకానికి ప్రతీక.
గత 25 సంవత్సరాల్లో చైనాలో భారీ పెట్టుబడు లు పెట్టిన బడా జపనీస్ కార్పొరేషన్‌లు ఇప్పుడు పరోక్షం గా రాజకీయ ఒత్తిళ్ళను, ఆర్థికంగా చైనాలో అస్థిమిత కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. దక్షిణచైనా, చైనా సముద్రాల్లో ఆర్థికంగా, రాజకీయంగా కీలక మైన కొన్ని భాగాలపై రెండు దేశాల మధ్య దౌత్య పరం గా పెరుగుతున్న వివాదం వల్ల, మూడేళ్ల క్రితం జపాన్‌ను త్రోసివేసి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా చైనా ఆవిర్భావం తదుపరి చైనాలో జపాన్ కంపెనీలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. జపాన్ కంపెనీలకు ఆకస్మికంగా చైనా మార్కెట్‌తో సంబంధం తగ్గింది. మరోవైపున, చైనా ఇప్పుడు జపాన్ కన్నా పొరుగు దక్షిణ కొరియాను ఎంచు కుంటున్నది. 1904, 1945 మధ్య కొరియా సామా జిక, రాజకీయ చరిత్ర, జపాన్-దక్షిణ కొరియా సంబంధాల్లో రెండవ ప్రపంచ యుద్ధానంతరం కోపతాపాలకు కారణమైంది. దక్షిణకొరియా-జపాన్ మధ్య సంబంధాల సాధారణీకరణకు చైనా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తున్నది.
జపాన్ మునుపెన్నటికన్నా ఎక్కువగా భారత్‌ను విశ్వసించటం మంచిదే. భారతదేశంలో వాణిజ్యం నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు స్థూలంగా సంతృప్తి తోనే ఉంటాయి. మన లీగల్, న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండటం ఇందుకొక ముఖ్య కారణం. అయినప్పటికీ ఈ అనువైన వాతావరణాన్ని ఉపయోగించుకుని అమెరికాకు చెందిన యూనియన్ కార్బయిడ్ భోపాల్‌లో మానవ విషాదానికి కారణమైంది, అది వేరువిషయం. జపాన్‌కు చెందిన పెద్ద ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఈనాడు మన దేశంలో పనిచేస్తున్నాయి. మధ్య, చిన్నతరహా పారి శ్రామిక రంగంలో మనదేశంలో పనిచేస్తున్న విదేశీ కంపెనీల్లో జపాన్ పెద్దదని కొద్దిమందికే తెలుసు. దేశవ్యాపితంగా పశ్చిమబెంగాల్‌నుంచి తమిళనాడు వరకు, మహారాష్ట్రనుంచి హర్యానా వరకు 100కుపైగా సంస్థలు పనిచేస్తున్నాయి.
భారతదేశానికి మరిన్ని భెల్‌లు, సైల్‌లు, హెచ్‌ఎ ఎల్‌లు, లార్సెన్ అండ్ టుబ్రో, ఇతర టెక్నాలజీ కంపెనీలు కావాలి. మనదేశంలో అణురియాక్టర్లు సహా ఇతర భారీ యంత్రాల తయారీలో మిత్సుబిషి, తోషిబ, హిటాచి వంటి జపాన్ మహాభారీ కంపెనీలు పాల్గొనటం ఇరు దేశాలకు ఎంతో ప్రయోజనకరం. ప్రధాని నరేంద్రమోడీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రపంచ మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ కంపెనీలకు బ్రహ్మాండ మైన అవకాశాలు కల్పిస్తున్నది. జపాన్ కంపెనీలు అనేక రంగాల్లో – రైల్వేలు, రోడ్లు, రేవులు, మైక్రో చిప్స్, రక్షణ, అణువిద్యుత్, అడ్వాన్స్‌డ్ స్టీలు, ఆయసేతర లోహాలు, సముద్రయాన సాధనాలు, వాణిజ్య నౌకలు, స్మార్ట్‌సిటీలు – ఇందులో ప్రము ఖంగా పాల్గొంటున్నాయి. టెక్నాలజీ, ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించుకుంటున్న దేశాల్లో చైనా తదుపరి భారత్ రెండవ స్థానంలో ఉంది. జపాన్ కంపెనీల రాక టెక్నాలజీలో నాయకత్వస్థానంలో ఉన్న ఇతర ప్రపంచ కంపెనీల ఆగమనానికి బాటవేస్తుంది.
మోడీ మీకిది తగునా?
అమూల్యగంగూలీ ఇలా రాస్తున్నారు:
తన హిందూ నేపథ్యాన్ని ప్రదర్శించుకోవటానికి నరేంద్రమోడీకి సొంత కారణాలుండవచ్చు. అయితే ఇతర మత విశ్వాసాలకు చెందిన విదేశీ నేతను తన సొంత విశ్వాస ప్రదర్శనలోకి లాగటం ఎబ్బెట్టుగా ఉంది. జపాన్ ప్రధాని షింజో అబె, మోడీతో కలిసి గంగామాతకు హారతి ఇచ్చే హిందూ ఆచారంలో పాల్గొన్న దృశ్యం -ప్రపంచ దౌత్యచరిత్రలో ఎన్నడూ చూడనిది. పర్యటన షెడ్యూలులో ఈ తరహా ఆరాధన గూర్చి ఏమి చెప్పారో తెలియదు. షెడ్యూలును జపాన్ అధికారులు ముందుగానే ఆమోదించారు. ఈ పూజలో ఇతర టూరిస్టుల్లాగా తాను ప్రేక్షకునిగా ఉంటానని షింజో భావించి ఉండవచ్చు. అయితే మంత్రాలు చదువుతూ, వివిధ స్తోత్రాలు చేస్తూ ఉండగా నది ఒడ్డున నిలబడటం అధికారిక కార్యక్రమంలో ఉండటం అరుదు.
మోడీ విదేశీ పర్యటనల్లో ఎక్కడో ఒకచోట మత ప్రార్థనల్లో పాల్గొనాలని – అది క్రైస్తవం లేక ముస్లిం కావచ్చు – కోరితే ఆయన ఎలా స్పందిస్తారో! స్కల్ క్యాప్(తలకు ధరించే టోపీ) ఇస్లామిక్ ప్రతీక ఉందని దాన్ని ధరించటానికి నిరాకరించిన వ్యక్తి ఆయన. హిందువు లాగా కనిపించమని ఒక విదేశీ అతిథిని కోరటం ఆశ్చర్యకరం.
సగటు హిందూ వీక్షకులకు, కాథలిక్ సాంప్రదా యంలో పెరిగిన వారికి సైతం ఒక విదేశీయుడు హిందూమత ఉత్సవంలో ప్రార్థనలు చేయటం ఏమంత అసాధారణంగా కనిపించదు. ఎందుకంటే, చర్చీలు, మసీదులు, గురుద్వారాల్లో ప్రార్థన చేయటా నికి హిందువుల సంకోచించరు. అయితే అది ఇతర సమాజాల లక్షణం కాకపోవచ్చు.
అతి ఎక్కువగా ప్రచారం లభించే ఘటనలో, హిందువులాగా ప్రార్థన చేయమని ఒక విదేశీయుణ్ణి – అతను అత్యున్నతుడైనా,కాకపోయినా- కోరాలన్న ఆలోచన మరే ప్రభుత్వానికి అది కాంగ్రెస్ అయినా, జెడి(యు) అయినా, బిజూ జనతాదళ్ అయినా వచ్చి ఉండేది కాదు. మతం- రాజ్యం మధ్య రాజ్యం దూరాన్ని పాటించాల్సి ఉండగా (అదే సెక్యులరిజం) ఇటువంటి నటన తద్విరుద్ధం. అయితే ఈ సూత్రాన్ని ఉల్లంఘించాలని, హిందూ దేశమైన భారతదేశంలో హిందూ మతాచారాలు-కనీసం పరివార్ రూపొం దిం చిన మేరకైనా – ఇతర మతాలవారిపై ఆధిక్యం వహిం చాలని బిజెపి ఉద్దేశపూర్వకంగా కోరుకుం టున్నది. తన దృష్టిలో రాజ్యాంగమే పవిత్రగ్రంథం అని పార్లమెంటులో మోడీ ప్రకటించటాన్ని గమనం లోకి తీసుకుంటే, గంగ, సరస్వతుల ఆరాధన వంటి చర్యలు ఆయన చిత్తశుద్ధి గూర్చి సందేహాలు లేవనెత్తకమానవు. అందువల్ల, దేశ బహుళత్వం గూర్చి మాట్లాడుతూ ఆయన ఇటీవల పార్లమెంటు లో గుర్తుచేసినట్లు హిందూమతాన్ని భారతదేశంలో ఆచరించే 12 మతాల్లో ఒకటిగానే పరిగణించాల్సి ఉంటుంది. కలిసికట్టుగా జీవించటానికి సంబంధించి భారతదేశ బహుళ సాంస్కృతిక సూత్రాలు మిగతా ప్రపంచానికి ఒక నమూనా. వాటిని నిర్లక్షపూరి తంగా ఉల్లంఘించకూడదు.
(ఐపిఎ)