Home అంతర్జాతీయ వార్తలు చక్రవర్తి పదవి త్యజించడానికి జపాన్ కేబినెట్ ఆమోదం

చక్రవర్తి పదవి త్యజించడానికి జపాన్ కేబినెట్ ఆమోదం

japanటోక్యో: రాజ విధుల నుంచి చక్రవర్తి అకిహిటో పదవీ విరమణకు అనుమతించే బిల్లును జపాన్ ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. బిల్లు ను చర్చ కోసం పార్లమెంట్‌కు పంపించనున్నట్లు కేబినెట్ ముఖ్య కార్యదర్శి యోషిహీద్ తెలిపారు. చర్చ అనంతరం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన పేర్కొన్నారు. బిల్లు చట్టంగా మారిన మూడేళ్లలోపు తప్పని సరిగా పదవిని త్యజించ వలసి ఉంటుంది. 83 ఏళ్ల చక్ర వర్తి అకిహిటో డిసెంబర్ 2018లో పదవి నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో పెద్ద కుమా రుడు ప్రిన్స్ నరుహిటో జనవరి 1, 2019లో బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలొచ్చాయి. వయో భారం, అనారోగ్యంతో పదవి నుంచి వైదొల గనున్నట్లు ఆగస్టులో అకిహిటో ప్రజల సమక్షం లో ప్రకటించారు. చక్రవర్తి పదవీ త్యాగానికి ప్రస్తుత చట్టాలు అనుమతించకపోవడంతో పార్ల మెంట్‌లో చట్టం చేయనున్నారు. రెండు శతాబ్దా ల జపాన్ రాజవంశ చరిత్రలో చక్రవర్తి తనకు తానే అధికారాలను బదలాయించాలని కోరడం ఇదే మొదటిసారి.